Thursday, July 30, 2015

Extraordinary lines about our beloved Abdul Kalam ji.

Hats off to author. But who wrote these?

VeenaaVedika_APJ abdulkalam

అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు.
ఐశ్య్వర్య వంతుడు అంత కన్నా కాదు
అఖండ భారతంలో దుర్భిని తో వెతికినా శత్రువు కానరాడు. 
ఏమిటయ్య నీ గొప్పతనం.. మేరు చిన్నబోయింది.
సిపాయి కాదు, కత్తి పట్టలేదు, క్షాత్రం కను చూపు మేరలో కానరాదు.
రాముడు కాదు రహీము కాదు...పలుకులు నేర్చిన రామ చిలుకా కాదు.
విల్లంబు లెత్తిన అర్జునుడు కాదు... సారథి కృష్ణుడూ కాదు.
శౌర్యం మాటే లేదు.... అయిననూ శత్రు దేశాన్ని బయపెట్టని క్షణం లేదు.
ఓడి ఆగింది లేదు, విజయ గర్వం లేదు... అసలు అలిసిన ఛాయ లేనే లేదు.
కూడ బెట్టింది లేదు...కలి అంటింది లేదు.
పదవీ గర్వం లేదు...పురస్కార వాంచ పుట్టుకతో లేదు. ఉన్నదంతా లక్ష్య సాధనే.
అంపశయ్య లేదు... ఆసుపత్రి సూది మందు లేదు.
జుట్టు చెదరలేదు.... నవ్వు ఆగలేదు.
భవబందాలు లేవు...బయపడింది లేదు.
ఎక్కడమ్మా ఓ మృత్యు మాత... నువ్వు గెలిచింది.
ఒక చుక్క కన్నీరు నువ్వు కూడా రాల్చి ఉంటావు... మాకు తెలియదంతే.

No comments:

Post a Comment