#hitam 3 పిల్లల్ని పెంచి, పెద్ద చేసి, బాగా సంపాదించాలని పర దేశాలు పంపుతారు. వాళ్ళ సంపాదన చూసి సంతోషిస్తారు కూడా. తప్పు లేదు. మరి తమను చూడటానికి రారు అని పరుల ముందు ధుఖం వెలిబుచ్చటం ఎంత వరకు సమంజసం?
ఈ పద్యం ఉద్దేశ్యం కన్న వాళ్ళను కావాలని నిర్లక్ష్యం చేసే వాళ్ళను సమర్థించడం కానే కాదు, తల్లిదండ్రులను మేల్కొపటానికి మాత్రమే.తమకేది ముఖ్యమో తేల్చుకోలేక కంగారు పడే తల్లి దండ్రుల గురించి. భవిష్యత్తును ప్రణాళిక బద్దంగా నిర్మించుకోకపోతే మనకై మనం సృస్టించుకున్న ఆ పరిస్థితుల్లో వుండలేక , వదిలించుకోలేక మిగితా జీవితం పశ్చాత్తాప పడాల్సి రావచ్చు. అది తల్లి దండ్రులైనా, పిల్లలైనా..
No comments:
Post a Comment